అక్కడ ఎటు చూసినా శవాల దిబ్బలే

కేరళంలోని వయనాడ్ విషాదంలో మట్టి దిబ్బల కింద కుప్పలుగా శవాలు బయటపడుతున్నాయి.

Update: 2024-08-03 11:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : కేరళంలోని వయనాడ్ విషాదంలో మట్టి దిబ్బల కింద కుప్పలుగా శవాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 358 మృత దేహాలను వెలికి తీయగా, 150 కి పైగా శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 200 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుల్లో వందకు పైగా పురుషులు ఉండగా... మహిళలు, పిల్లలు అంతకు మించి ఉన్నారు. అదృశ్యమయిన వారి కోసం, ఇంకా నివాస ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. కాగా సహాయక చర్యల్లో భాగంగా మట్టి, బండరాళ్లను తొలగిస్తుండగా వాటికింద నుజ్జు నుజ్జయిన శవాలు గుట్టలుగా లభిస్తుండటం అందరినీ తీవ్రంగా కలచి వేస్తోంది. కొన్నిసార్లు కేవలం కొన్ని శరీర భాగాలు మాత్రమే లభిస్తుండటం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. పదుల అడుగుల మేర పేరుకు పోయిన మట్టి పొరల కింద తమ వాళ్ళ ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమో అని ఆశగా వెతుకున్నవారు అక్కడి దృశ్యాలను చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. 


Similar News