Corona : యాక్టివ్ కేసులు@ 10 వేలు.. కీలక విషయాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో కరోనా టెన్షన్ ఇంకా తొలగలేదు. కొత్త కేసులు నమోదు అవుతుండటంతో మళ్లీ ప్రజల్లో టెన్షన్ మొదలైంది.

Update: 2023-03-27 08:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా టెన్షన్ ఇంకా తొలగలేదు. కొత్త కేసులు నమోదు అవుతుండటంతో మళ్లీ ప్రజల్లో టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 56,551 మందిని పరీక్షించగా.. 1,805 మందికి వైరస్ సోకినట్లు తెలిపింది. ముందు రోజు కూడా ఇదే స్థాయిలో 1890 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రోజు వారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉందని పేర్కొంది.

కొత్తకేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు 10వేల మార్కు దాటాయి. 134 రోజుల తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. కాగా కరోనాతో దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే ఆరుగురు మరణించినట్లు గణాంకాల్లో ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4.47 కోట్లమందికి కరోనా సోకగా 5.30లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.79 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

Tags:    

Similar News