'ఈ దేశంలోని ప్రతి ఆడబిడ్డకు ఆత్మ గౌరవమే మొదటి ప్రాధాన్యత'

Update: 2023-12-31 09:15 GMT

న్యూఢిల్లీ: రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత వినేష్ ఫోగట్ తన ఖేల్ రత్న, అర్జున అవార్డులను వాపస్ చేయడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీపై మండిపడ్డారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ)కి అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికవడంపై నిరసనగా వినేష్ ఫోగట్ అవార్డులను తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన రాహుల్ గాంధీ, దేశంలోని ప్రతి ఆడబిడ్డకు ఆత్మ గౌరవమే మొదటి ప్రాధాన్యత అని, ఆ తర్వాతే ఏ పతకమైనా, గౌరవమైనా వస్తుందని రాహుల్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ వీర వనితల కన్నీళ్ల కంటే ప్రధాని మోడీకి తెచ్చిపెట్టుకున్న బాహుబలి నుంచి పొందిన రాజకీయ లబ్ది ఎక్కువ అయిందా? అంటూ ప్రశ్నించారు. దేశ ప్రధాన మంత్రి ఈ జాతి సంరక్షకుడని, ఆయన నుంచి ఇటువంటి అమానవీయత చూడటం బాధిస్తోందని రాహుల్ అన్నారు. 

Tags:    

Similar News