జోడో యాత్రలో భద్రతా ఉల్లంఘనలు.. పటిష్ట భద్రత కల్పించాలని కేంద్రానికి లేఖ

భారత జోడో యాత్రలో భద్రతా ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి బుధవారం లేఖ రాసింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సాగుతున్న యాత్రకు సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది.

Update: 2022-12-28 09:20 GMT

న్యూఢిల్లీ: భారత జోడో యాత్రలో భద్రతా ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి బుధవారం లేఖ రాసింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సాగుతున్న యాత్రకు సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. శనివారం ఢిల్లీలో యాత్ర ప్రవేశిస్తున్న సమయంలో పలుమార్లు ఆటంకాలు ఏర్పడినట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లేఖలో పేర్కొన్నారు. పెద్ద ఎత్తున జనాన్ని నియంత్రించడంలో విఫలమైందని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఢిల్లీ పోలీసులు జెడ్+ భద్రతను కేటాయించిన రాహుల్ గాంధీ చుట్టూ పహారా నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారని లేఖలో పేర్కొన్నారు.

పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీతో కలిసి నడిచే భారత యాత్రికులు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఢిల్లీ పోలీసులు మూగ ప్రేక్షకులుగా మిగిలిపోయారని ఆరోపించారు. వచ్చే నెల 3న యాత్ర పంజాబ్, జమ్ముకశ్మీర్‌లో ప్రవేశించినున్న నేపథ్యంలో రాహుల్ గాంధీకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత తో పాటు యాత్రలో పాల్గొన్న వారికి తగిన భద్రత కల్పించాలని కోరారు. హర్యానాలో గురుగ్రాంలో యాత్రలో ఉల్లంఘనలపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు వేణుగోపాల్ చెప్పారు.

Also Read..

ప్రధాని మోడీ తల్లి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల 

Tags:    

Similar News