జైలు నాకు స్వర్గంలా ఉంది.. త్వరలోనే వస్తా.. నేరస్థుడి లైవ్ స్ట్రీమింగ్ (వీడియో వైరల్)
జైలు నాకు స్వర్గంలా ఉందంటూ.. శిక్ష అనుభవిస్తున్న నేరస్థుడు జైలు నుంచి వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది
దిశ, డైనమిక్ బ్యూరో: జైలు నాకు స్వర్గంలా ఉందంటూ.. శిక్ష అనుభవిస్తున్న నేరస్థుడు జైలు నుంచి వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆసిఫ్ అనే ఖైది ఫోన్ ద్వారా వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. దాదాపు రెండు నిమిషాల పాటు సాగిన వీడియోలో జైలు నాకు స్వర్గంలా ఉందని, ఇక్కడ జీవితాన్ని ఆస్వాధిస్తున్నానని, త్వరలోనే బయటకి వస్తానని వ్యాఖ్యానించాడు.
ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ కావడంతో జైలులో శిక్ష అనుభవిస్తున్న నేరస్థుడి చేతికి పోన్ వెళ్లడంపై ఆ జైలు సిబ్బందిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2019 లో రాకేష్ యాదవ్ అనే కాంట్రాక్టర్ ను హత్య చేసిన కేసులో ఆసిఫ్ శిక్ష అనుభవిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన రాకేష్ సోదరుడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జైలు సిబ్బంది ఆసిఫ్ కి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని, దానికి ఆ వీడియోనే సాక్ష్యంగా చూపుతూ.. ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు.. విచారణ జరుపుతున్నామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
रामराज्य हैं
— Mαɳιʂԋ Kυɱαɾ αԃʋσƈαƚҽ 🇮🇳🇮🇳 (@Manishkumarttp) March 14, 2024
उत्तर प्रदेश बरेली जेल में बन्द जेल में बंद आरोपी का वीडियो वायरल PWD ठेकेदार हत्याकांड का आरोपी जेल में है बंद जेल में बंद आरोपी का लाइव वीडियो चैट वायरल,, pic.twitter.com/8yZOg1m2xK