సీఎం స్టాలిన్ డీలిమిటేషన్‌పై డ్రామా చేస్తున్నారు: కె. అన్నామలై

కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా.. డీలిమిటేషన్‌ చేయనుందని ఆరోపిస్తూ.. తమిళనాడు సీఎం స్టాలిన్ గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు.

Update: 2025-03-22 05:12 GMT
సీఎం స్టాలిన్ డీలిమిటేషన్‌పై డ్రామా చేస్తున్నారు: కె. అన్నామలై
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా.. డీలిమిటేషన్‌ (Delimitation) చేయనుందని ఆరోపిస్తూ.. తమిళనాడు సీఎం స్టాలిన్ (Tamil Nadu CM Stalin) గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ఫేర్ డీలిమిటేషన్‌ (Fare Delimitation) అంటూ.. దేశంలోని ఎన్డీయే కూటమి మినహా అన్ని పార్టీలకు అఖిలపక్షం సమావేశానికి (All-party meeting) పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తమిళనాడులోని చెన్నైలో ఐటీసీ చోళలో ఈ సమావేశం ఏర్పాటు చేయగా.. తెలంగాణ నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్, కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి,, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటు ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరైన విషయం తెలిసిందే.

కాగా తమిళనాడు సీఎం (Tamil Nadu CM) అధ్యక్షతన జరుగుతున్న ఈ అఖిలపక్షం సమావేశంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు (President of Tamil Nadu BJP) కె. అన్నామలై (K. Annamalai) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మా రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలతో అనేక సమస్యలు ఉన్నాయి. కేరళతో ముల్లపెరియార్ ఆనకట్ట సమస్య ఉంది. కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక సరిహద్దు నుండి హోసూర్ వైపు మెట్రో మార్గాన్ని వ్యతిరేకించింది. వివిధ సందర్భాల్లో.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న స్టాలిన్.. పొరుగు రాష్ట్రాలను సందర్శించినప్పుడు ఈ అంశాలను లేవనెత్తలేదు. కానీ ఈ రోజు.. ఆయన అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు, ఇతర నేతలను పిలిచి డీలిమిటేషన్‌పై డ్రామా చేస్తున్నారని.. ఇది అసలు సమస్యే కాదని ఈ సందర్భంగా అన్నామలై.. సీఎం స్టాలిన్ పై మండిపడ్డారు.


Similar News