Cm biren singh: హింస కారణంగా రూ.500 కోట్ల ఆదాయం కోల్పోయాం..మణిపూర్ సీఎం బిరేన్ సింగ్
గత ఆర్థిక సంవత్సరంలో జాతి హింస కారణంగా రూ.500 కోట్ల ఆదాయం కోల్పోయామని మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ తెలిపారు. బుధవారం ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ వివరాలను వెల్లడించారు.
దిశ, నేషనల్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో జాతి హింస కారణంగా రూ.500 కోట్ల ఆదాయం కోల్పోయామని మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ తెలిపారు. బుధవారం ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ వివరాలను వెల్లడించారు. హింస చెలరేగినప్పటి నుంచి రాష్ట్రంలో 226 మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది. అలాగే 4,569 ఇళ్లు ధ్వంసం కాగా..5,554 మంది రైతుల వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. అంతేగాక 39 మంది గల్లంతు కాగా..59,414 మంది నిర్వాసితులైనట్టు పేర్కొంది. అల్లరకు సంబంధించి మొత్తం 11,892 పోలీసు కేసులు నమోదయ్యాయి. మణిపూర్ అంతటా 302 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర పోలీసులను బలోపేతం చేయడానికి బడ్జెట్‌లో రూ. 2,900 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. కాగా, అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలని పది మంది కుకీ ఎమ్మెల్యేలను సీఎం ఆహ్వానించినా వారు హాజరు కాలేదు.