CLAT-2025 Results: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు డౌన్‌లోడ్ లింక్ ఇదే..!

దేశవ్యాప్తంగా 24 ప్రధాన లా విశ్వవిద్యాలయా(Law Universities)ల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT) ఫలితాలు రిలీజ్ అయ్యాయి.

Update: 2024-12-08 09:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా 24 ప్రధాన లా విశ్వవిద్యాలయా(Law Universities)ల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://consortiumofnlus.ac.in/clat-2025/view-result.html లో తమ అడ్మిట్ కార్డు(Admitcard)/అప్లికేషన్ నంబర్(Application No), డేట్ ఆఫ్ బర్త్(DOB) వివరాలు ఎంటర్ చేసి స్కోర్ కార్డు(Score card) డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇక కౌన్సెలింగ్ ప్రక్రియ(Counseling Process)కు సంబంధించి డీటెయిల్స్ డిసెంబర్ 9న ప్రకటించనున్నారు. కాగా కామన్ లా అడ్మిషన్-2025 పరీక్షను 2024 డిసెంబర్ 1న ఆఫ్​లైన్​ విధానంలో జరిగింది. భారతదేశంలోని 25 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 141 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకే షిఫ్ట్​లో ఈ పరీక్షను నిర్వహించారు. కాగా నేషనల్ లా స్కూల్స్(National Law Schools), యూనివర్సిటీలు(Universities) కలిసి ప్రతి సంవత్సరం క్లాట్ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్షలో మెరిట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు యూజీ(UG), పీజీ(PG) డిగ్రీ ప్రోగ్రాంలు అందిస్తున్నాయి.

Tags:    

Similar News