Class 10 : విద్యార్థినికి అశ్లీల వీడియోలు పంపిన టీచర్.. పోలీసులకు ఫిర్యాదు

దిశ, నేషనల్ బ్యూరో : టీచర్‌ తనకు వాట్సాప్, స్నాప్ ఛాట్ల ద్వారా అశ్లీల ఫొటోలు, వీడియోలను పంపి వేధిస్తున్నాడంటూ ఉత్తరాఖండ్‌‌లోని హల్ద్వానీలో పదోతరగతి విద్యార్థిని(16) పోలీసులను ఆశ్రయించింది.

Update: 2024-09-01 14:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో : టీచర్‌ తనకు వాట్సాప్, స్నాప్ ఛాట్ల ద్వారా అశ్లీల ఫొటోలు, వీడియోలను పంపి వేధిస్తున్నాడంటూ ఉత్తరాఖండ్‌‌లోని హల్ద్వానీలో పదోతరగతి విద్యార్థిని(16) పోలీసులను ఆశ్రయించింది. దీని గురించి ఆమె తొలుత తన తల్లిదండ్రులకు తెలియజేసింది. అనంతరం పేరెంట్స్‌తో కలిసి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. దర్యాప్తును మొదలుపెట్టిన పోలీసులు, త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామని వెల్లడించారు.

బాలికపై బీజేపీ నేత లైంగిక వేధింపులు.. పార్టీ నుంచి బహిష్కరణ

ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా బీజేపీ నేత భగ్వత్ సింగ్ బోరాను పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాలిక (14) తన సోదరులతో కలిసి అటవీ ప్రాంతంలో మేకలను మేపుతుండగా అక్కడికి భగ్వత్ సింగ్ బోరా వెళ్లాడు. చాక్లెట్లు ఇస్తానని పిలిచి సదరు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి, భగ్వత్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 24న ఈ ఘటన చోటుచేసుకోగాా, ఆలస్యంగా ఆగస్టు 30న పోలీసులకు ఫిర్యాదు అందడం గమనార్హం. ఈనేపథ్యంలో భగ్వత్ సింగ్ బోరాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్ ఓ ప్రకటన విడుదల చేశారు.

మహిళ ఉన్న హోటల్‌ గదిలోకి చొరబడిన టెకీ

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న ఓ హోటల్‌లో 32 ఏళ్ల టెకీ దారుణానికి తెగబడ్డాడు. ఓ మల్టీ నేషనల్ కంపెనీకి చెందిన మహిళ ఉన్న హోటల్ గదిలోకి అనుమతి లేకుండా చొరబడ్డాడు. సదరు మహిళలు కేకలు వేయడంతో.. హోటల్ సిబ్బంది హుటాహుటిన వచ్చి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు పనిచేస్తున్న అమెరికా కంపెనీకి.. నిందితుడు ఒక (టెకీ) క్లయింట్‌గా ఉన్నాడని దర్యాప్తులో గుర్తించారు.


Similar News