Supreme Court: పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ అధికారిక ప్రూఫ్ కాదు: సుప్రీంకోర్టు

రోడ్డు ప్రమాదంలో బాధితుడికి పరిహారం మంజూరు చేసే వ్యవహారంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది.

Update: 2024-10-24 16:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పుట్టినతేదీకి సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పు వెలువరించింది. పుట్టునతేదీకి ఆధార్ కార్డు అధికారిక ప్రూఫ్ కాదని పేర్కొంది. స్కూల్ రికార్డుల్లో ఉండే తేదీనే పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. రోడ్డు ప్రమాదంలో బాధితుడికి పరిహారం మంజూరు చేసే వ్యవహారంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వయసు నిర్ధారణకు ఆధార్‌కార్డును ఆమోదించిన పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది. 2015లో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి బంధువులు దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దానికి ముందు మరణించిన వ్యక్తికి పరిహారం ఇవ్వాలని రోహ్‌తక్ మోటార్ యాక్సిడెంట్ ట్రెబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఈ వ్యవహారం హైకోర్టుకు చేరగా పరిహారాన్ని తగ్గించి ఆధార్ కార్డు ఆధారంగా వయస్సును నిర్ధారించి పరిహారం లెక్కించింది. అయితే, బాధితులు హైకోర్టు వయసును బట్టి పరిహారం లెక్కించిందని సుప్రీంకోర్టుకు వెళ్లారు. స్కూల్ రికార్డుల ఆధారంగా తని వయసు 45 ఏళ్లేనని కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం మోటార్ యాక్సిడెంట్ ట్రెబ్యునల్ తీర్పును సమర్థిస్తూ పుట్టిన తేదీని నిర్ధారించేందుకు ఆధార్ కార్డు అధికారిక ప్రూఫ్ కాదని వెల్లడించింది.

Tags:    

Similar News