బీహార్ కు కొత్త రైల్వే లైన్ మంజూరు చేసిన కేంద్ర కేబినెట్

అయోధ్య - సీతామర్హి మధ్య కనెక్టివిటీ కోసం కొత్త రైల్వే ప్రాజెక్టు నేడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Update: 2024-10-24 17:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : అయోధ్య - సీతామర్హి మధ్య కనెక్టివిటీ కోసం కొత్త రైల్వే ప్రాజెక్టు నేడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నర్కాటియాగంజ్-రాక్సౌల్- సీతామర్హి (పునౌరా ధామ్) – ధర్భంగ రైల్వే లైన్ తోపాటు సీతామర్హి- ముజఫర్ పూర్ సెక్షన్ల మధ్య 256 కి.మీ పొడవునా రైల్వే లైన్ డబ్లింగ్ చేయాలని గురువారం కేంద్రం కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఈ రెండు ప్రాజెక్టుల వ్యయం రూ. 6,798 కోట్లుగా అంచనా వేసింది. ఈ ప్రాజెక్టుల వల్ల యూపీలోని అయోధ్య, బీహార్ లోని సీతామర్హి మధ్య యాత్రికుల ప్రయాణికులకు రైలు కనెక్టివిటీ పెంచడానికి వీలు కలుగుతుంది. దీనిపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయోధ్య నుంచి సీతాదేవి జన్మస్థలం సీతామర్హి (పునౌరా ధామ్)కు భక్తులు ప్రయాణించడానికి ఈ రైల్వే లైన్ నిర్మాణంతో వెసులుబాటు కలుగుతుందని అన్నారు. 


Similar News