న్యాయ వ్యవస్థ దేశీయీకరణ జరగాలి.. సీజేఐ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యలు
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో న్యాయవవస్థను దేశీయీకరణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తాజాగా ఇండియా టుడే సదస్సులో జస్టిస్ ఇన్ ది బ్యాలెన్: మై ఐడియా ఆఫ్ ఇండియా’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. న్యాయవ్యవస్థలో మనం భారతీయీకరించాల్సిన తొలి భాగం కోర్టు భాష అని అన్నారు. జిల్లా కోర్టులలో ఉపన్యాస భాష ఇంగ్లీష్, ఉన్నత న్యాయస్థానాలు, హైకోర్టులు, సుప్రీంకోర్టులలో ప్రసంగ భాషగా ఉందని చెప్పారు.
అయితే ఇది వలస వారసత్వాన్ని సూచిస్తుందని చెప్పారు. అయితే శాసనాలు, తీర్పుల పరంగా చూసుకున్నపుడు ఇంగ్లీష్‌తో అనేక సౌలభ్యాలు ఉన్నాయని తెలిపారు. కాగా, ప్రజలను చేరుకునేందుకు మాత్రం వారి స్థానిక భాషలే ఆధారమని అన్నారు. ఇప్పటికే ఈ విషయంలో ప్రక్రియ మొదలైందని చెప్పారు.