‘గామిని’ చిరుత.. కునో నేషనల్ పార్క్‌లో తన 5 కూనలతో వర్షంలో ఆటలు

దక్షిణాఫ్రికా చిరుత ‘గామిని’ తన ఐదు కూనలతో శుక్రవారం ఉదయం మధ్యప్రదేశ్ షియోపూర్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వర్షాన్ని ఆస్వాదించింది.

Update: 2024-07-06 08:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణాఫ్రికా చిరుత ‘గామిని’ తన ఐదు కూనలతో శుక్రవారం ఉదయం మధ్యప్రదేశ్ షియోపూర్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వర్షాన్ని ఆస్వాదించింది. ఈ సందర్భంగా గామిని తన పిల్లలతో ఆడుకుంటూ కనిపించింది. కూనలు కూడా సరదా చేష్టలతో చాలా అందంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తాజాగా వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో తాజాగా నెటిజన్లను ఆకర్షిస్తోంది.

కాగా, గతంలో కేంద్ర ప్రభుత్వం గామిని అనే ఆడ చిరుతను దక్షిణాఫ్రికాలోని కలహరి టైగర్‌ రిజర్వ్‌ నుంచి తెప్పించిన విషయం తెలిసిందే. ఈ చిరుత ఈ ఏడాది మార్చి 10న ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అయతే, చీతాల పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ కింద నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి మొత్తం 20 చీతాల్ని భారత్‌కు తీసుకు రాగా.. వాతావరణం అనుకూలించక కొన్ని చిరుతలు మృత్యువాత పడ్డ విషయం విదితమే.

Tags:    

Similar News