చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం.. పునరుద్ధరణకు తీవ్ర యత్నం

చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం కలిగింది..

Update: 2024-12-12 05:29 GMT

దిశ, వెబ్ డెస్క్: చాట్‌జీపీటీ(Chatgpt) సేవలకు అంతరాయం కలిగింది. ఈ తెల్లవారుజాము నుంచే ఓపెన్‌ఏఐకి చెందిన ఏపీఐ, సోరా సేవల్లో సమస్య తలెత్తింది. దీంతో మెసేజింగ్ యాప్ వాట్సప్, సోషల్ మీడియా అయిన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కంపెనీ సిబ్బంది సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యూజర్లు ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యతో తమ యాప్స్‌ను వినియోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో యూజర్లకు ఓపెన్‌ఏఐ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, వీలైంత త్వరగా సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది.

కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పని చేసే చాట్‌జీపీటీని 2022లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చాట్‌బాట్(Chatbot) సహాయంలో కేవలం సెకన్ల వ్యవధిలోనే మనకు కావాల్సిన కచ్చితమైన సమాచారాన్ని అందించేలా రూపొందించారు. ఈ మేరకు అప్పటి నుంచి సేవలు కొనసాగిస్తూ వచ్చింది. సడెన్‌గా సాంకేతిక సమస్య తలెత్తడంతో పరిష్కారం చూపేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను త్వరలో ఇవ్వనుంది.

Tags:    

Similar News