Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో రగడ

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ (Jammu and Kashmir Assembly) సమావేశాల్లో రగడ జరిగింది. ఆరేళ్ల తర్వాత సోమవారం జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.

Update: 2024-11-04 08:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ (Jammu and Kashmir Assembly) సమావేశాల్లో రగడ జరిగింది. ఆరేళ్ల తర్వాత సోమవారం జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. కాగా.. తొలి అసెంబ్లీ సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(PDP) ఎమ్మెల్యే వహీద్‌ పర్రా(Wahid Parra) ఆర్టికల్‌ 370( Article 370) రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానంపై అభ్యంతరం చెబుతూ బీజేపీ(Bharatiya Janata Party) సభ్యులు ఆందోళన తెలిపారు. కాగా అధికారిక నేషనల్ కాన్ఫరెన్స్‌(National Conference) పార్టీకి చెందిన స్పీకర్ రహీమ్ రాథర్(Rahim Rather) మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు లాంటి తీర్మానాన్ని తాను ఇంకా అంగీకరించలేదని చెప్పారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

ఆర్టికల్ 370 రద్దు

ఇకపోతే, 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. దీంతో, ఆ ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని ఫరూక్‌ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ డిమాండ్‌ చేస్తోంది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్‌ మంత్రివర్గం తీర్మానం చేశారు. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం కూడా తెలిపారు. ఈ పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించే యోచనలో కేంద్రం ఉందని, ఈమేరకు హామీ లభించిందని ప్రచారం జరుగుతోంది. ఒమర్‌ అబ్దుల్లా కూడా గత అయిదేళ్లుగా అందుకోసమే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌సీ-కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించింది. 90 స్థానాల శాసనసభలో ఎన్‌సీ 42 సీట్లలో, కాంగ్రెస్‌ 6 స్థానాల్లో నెగ్గింది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah ) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


Similar News