ముంబై వాసులకు చుక్కలు చూపించిన మోడీ.. ఏమైందో తెలుసా?

ముంబాయి నగర వాసులకు ప్రధాని మోడి చుక్కలు చూపించారని సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Update: 2024-05-16 11:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముంబాయి నగర వాసులకు ప్రధాని మోడి చుక్కలు చూపించారని సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ముంబైలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. ప్రధానిని చూసేందుకు వేలాది మంది వీధుల్లోకి రావడంతో, ఘాట్‌కోపర్ మెట్రో స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ప్రధాని మోడీ రోడ్‌షోకు ముందు జాగృతి నగర్, ఘాట్‌కోపర్ స్టేషన్‌ల మధ్య రైలు సేవలను అధికారులు నిలిపివేశారు.

భద్రతా కారణాల దృష్ట్యా మెట్రో సేవలను నిలిపివేయడంతో, అనేక మంది కార్యాలయాలకు వెళ్లేవారి ప్రయాణానికి అనుకోకుండా అంతరాయం కలిగింది. దాదాపు రెండు, మూడు గంటల తర్వాత తిరిగి మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఈ మెట్రోలో రోజుకు మూడు లక్షల మందికి పైగా ప్రయాణిస్తుంటారని, ప్రధాని రోడ్ షో కారణంగా వారందరికీ తీవ్ర అంతరాయం ఏర్పడిందని శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. కాగా, ముంబైలోని ఆరు లోక్‌సభ నియోజకవర్గాలకు, మహారాష్ట్రలోని మరో ఏడు లోక్‌సభ నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ రోడ్‌షో నిర్వహించారు.

Tags:    

Similar News