Indo-Bangladesh border: బంగ్లాదేశ్ పరిణామాల దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటన నేపథ్యంలో మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పరిస్థితని పర్యవేక్షించేందుకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది.

Update: 2024-08-09 10:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటన నేపథ్యంలో మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పరిస్థితని పర్యవేక్షించేందుకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద పరిస్థితిని పర్యవేక్షించడానికి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్రహోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫీసర్ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భారతీయ పౌరుల భద్రతను నిర్ధారించడానికి బంగ్లా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు.

బంగ్లావ్యాప్తంగా నిరసనలు

బంగ్లాదేశ్ అంతటా విద్యార్థుల నిరసనల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలిపెట్టి వెళ్లారు. అప్పటి నుండి దేశంలో హిందూ దేవాలయాలు, మైనరిటీ వర్గాలకు చెందిన సభ్యులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇకపోతే, బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్‌ అవార్జు గ్రహీత ప్రొఫెసర్‌ మహమ్మద్‌ యూనస్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పొరుగు దేశంలోని హిందువులు, ఇతర మైనారిటీ వర్గాల భద్రత రక్షణ సాధారణ స్థితికి రావాలని ఆశిస్తున్నట్లు ప్రధాని మోడీ అన్నారు. ఇప్పటికే సరిహద్దుల్లో నిఘాను కఠినతరం చేశారు. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.


Similar News