Finance Minister: మరికొద్ది సేపట్లో నీతి ఆయోగ్ సమావేశం.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై మంత్రి కీలక వ్యాఖ్యలు

మరికొద్ది సేపట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన రాష్ట్రంలోని సీఎంలతో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది.

Update: 2024-07-27 03:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: మరికొద్ది సేపట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన రాష్ట్రంలోని సీఎంలతో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆమె మరోసారి స్పష్టం చేశారు. అయితే దీనికి రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉందని.. రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తే.. పన్ను రేటును ఫిక్స్ చేయవచ్చని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రాల వ్యాట్ ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. కాగా కేంద్రం పెట్టిన ప్రపోజల్ కే రాష్ట్రాలు ఒకే చెబితే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ చేరితే.. త్వరలోనే వాటి ధరలు తగ్గేందుకు ఆస్కారం ఉంది.

మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో 9 గంటలకు ప్రారంభం కానుంది. వికసిత భారత్ 2047 అజెండాగా ఈ నీతి ఆయోగ్‌ సమావేశం జరగనుంది. ఇందులో సీఎం చంద్రబాబు పోలవరం కొత్త డయాఫ్రమ్‌ వాల్ నిర్మాణ ప్రతిపాదనలతో పాటు అమరావతి నిర్మాణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. కాగా ఈ సమావేశానికి బీజేపీ యేతర ప్రభుత్వాలు అయిన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పంజాబ్, జార్ఖండ్, రాష్ట్రాలు ఈ నితిఅయోగ్ సమావేశాలను బహిష్కరించాయి.


Similar News