మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. అకౌంట్లలో రూ. 5000 జమ!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అనేక పథకాలు అమలులోకి తీసుకొస్తున్నాయి.

Update: 2024-07-08 09:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అనేక పథకాలు అమలులోకి తీసుకొస్తున్నాయి. ఇవాళే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం.. శక్తి పథకం కింద స్వయం ‘‘పాడి పశువులు, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, దేశవాళీ కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాల’’ ను మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కాంగ్రెస్ సర్కారు జిల్లా వారిగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీటి నిర్వహణకు బ్యాంకులు, మండల మహిళా సమాఖ్య, స్త్రీనిధి ద్వారా రుణం అందజేయనుందని ప్రకటించింది. తాజాగా కేంద్రం అమలు చేస్తోన్న స్కీంలలో ప్రధాన మాతృత్వ వందన్ యోజన పథకాన్ని మహిళలు ఉపయోగించుకోవాలని కేంద్రం సూచించింది. ఈ పథకం ద్వారా ప్రెగ్నెన్సీ మహిళలు రూ. 5000 పొందవచ్చు. 2017 నుంచి ఈ స్కీం అమలులో ఉన్నప్పటికీ చాలా మంది మహిళలకు దీనిపై అవగాహన లేదు. అయితే స్కీంలో జమచేసిన మొత్తాన్ని మూడు విడతలుగా గర్భిణీ మహిళలు పొందవచ్చు. గర్భం దాల్చాక 1000.. ఆరు నెలలకు 2000 రూపాయలు, పిల్లలు జన్మించిన అనంతరం చివరి విడత రూ. 2000 మొత్తాన్ని పొందవచ్చు. కానీ 19 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. https://pmmvy.wcd.gov.in/ అనే వెబ్ సైట్‌లో సిటిజన్ లాగిన్ ఎంపిక ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని ఫస్ట్ కాన్పు లేదా రెండో కాన్పు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో మీ ఆధార్ కార్డు నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ తదితర కేటగిరీల్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. 


Similar News