CDS : త్రివిధ దళాలు ఐక్యంగా ఉంటే తిరుగుండదు : సీడీఎస్

దిశ, నేషనల్ బ్యూరో : థియేటర్ కమాండ్‌ల ఏర్పాటు దిశగా అడుగులుపడుతున్న ప్రస్తుత తరుణంలో భారత త్రివిధ దళాలు కలిసికట్టుగా ముందుకుసాగాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు.

Update: 2024-09-04 17:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో : థియేటర్ కమాండ్‌ల ఏర్పాటు దిశగా అడుగులుపడుతున్న ప్రస్తుత తరుణంలో భారత త్రివిధ దళాలు కలిసికట్టుగా ముందుకుసాగాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. భవిష్యత్ సైనిక ఆపరేషన్లు ఫలప్రదంగా పూర్తికావాలంటే త్రివిధ దళాలు సంయుక్తంగా పనిచేయడం, ఉమ్మడి ప్రణాళికలను అమలు చేయడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

బుధవారం యూపీలోని లక్నోలో జరిగిన జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్సులో సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ప్రసంగించారు. త్రివిధ దళాలను ఏకతాటిపైకి తెచ్చే రోడ్ మ్యాప్‌ అమలులో భాగంగా ఇప్పటిదాకా పలు చర్యలను చేపట్టినందుకు వాయుసేన, సైన్యం, నేవీకి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కాన్ఫరెన్సులో గురువారం రోజు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగించనున్నారు.


Similar News