సిసోడియాకు బిగుస్తోన్న ఉచ్చు.. మాజీ మంత్రి ఓఎస్డీని విచారిస్తున్న సీబీఐ!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఓ వైపు సీబీఐ మరో వైపు తమ దర్యాప్తులు స్పీడప్ చేశారు. మనీష్ సిసోడియాను మంగళవారం తీహార్ జైలులో ఈడీ ప్రశ్నిస్తుండగా.. మరో వైపు సిసోడియా ఓఎస్డీ దేవేంద్ర శర్మ అలియాస్ రింకుపై సీబీఐ ఫోకస్ పెట్టింది.

Update: 2023-03-07 09:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఓ వైపు సీబీఐ మరో వైపు తమ దర్యాప్తులు స్పీడప్ చేశారు. మనీష్ సిసోడియాను మంగళవారం తీహార్ జైలులో ఈడీ ప్రశ్నిస్తుండగా.. మరో వైపు సిసోడియా ఓఎస్డీ దేవేంద్ర శర్మ అలియాస్ రింకుపై సీబీఐ ఫోకస్ పెట్టింది. సీబీఐ ప్రధాన కార్యాలయంలో దేవేంద్ర శర్మను సీబీఐ అధికారులు విచారించారు. ఉదయం 11 గంటలకు ఈ విచారణ మొదలైంది. కాగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దేవేంద్ర శర్మను గతేడాది ఈడీ ప్రశ్నించింది. తాజాగా మనీష్ సిసోడియాను విచారిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఓఎస్డీగా పని చేసిన దేవేంద్ర శర్మను సైతం ఆరా తీస్తుండటం ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News