కులగణనతో సమాజం చీలిపోయే ప్రమాదం..చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు

కులగణనపై కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ(రామ్ విలాస్ పాశ్వాన్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కులగణనకు మద్దతిచ్చిన ఆయన కులగణణ వివరాలు బహిర్గతం చేస్తే సమాజంలో విభజనకు దారి తీస్తుందని తెలిపారు.

Update: 2024-07-20 12:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కులగణనపై కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ(రామ్ విలాస్ పాశ్వాన్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కులగణనకు మద్దతిచ్చిన ఆయన కులగణణ వివరాలు బహిర్గతం చేస్తే సమాజంలో విభజనకు దారి తీస్తుందని తెలిపారు. ఈ వివరాలను బయటకు వెళ్లడించొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎడిటర్స్‌తో శనివారం జరిగిన ఇంటరాక్షన్‌లో ఆయన మాట్లాడారు. ఇటీవల కులగణన నిర్వహించిన బిహార్‌లో ఆ వివరాలు బహిరంగపర్చడానికి నేను మద్దతివ్వబోనని తెలిపారు. ఈ డీటెయిల్స్ సమాజాన్ని రెండుగా చీల్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ)పై అడిగిన ప్రశ్నికు ఆయన స్పందిస్తూ..ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఎటువంటి చర్చలు ఏకకాలంలో జరగలేదన్నారు. దీనిపై ముుసాయిదా సిద్ధమైన తర్వాతే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తామని తెలిపారు. యూసీసీపై ఇప్పటికీ అనేక ఆందోళనలు ఉన్నాయని చెప్పారు. ‘భారత్ భిన్న వైవిధ్యాలు కలిగిన దేశం. భాష, సంస్కృతి ఇతర అనేక అంశాల్లో తేడాలుంటాయి. కాబట్టి అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలి’ అని వ్యాఖ్యానించారు. ఒకే దేశం ఒకే ఎన్నికల ప్రతిపాదనకు మాత్రం ఎల్జేపీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. యూసీసీ అంటే హిందూ ముస్లిం విభజన కాదని అందరినీ ఓకే దగ్గరకు తీసుకురావడమేనని తెలిపారు. 

Tags:    

Similar News