చిక్కుల్లో కర్ణాటక కాంగ్రెస్!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని చిక్కులు ఎదురవుతున్నాయి. ఆ పార్టీ ముఖ్యనేత సిద్ధరామయ్య లింగాయత్‌లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. దీనిపై బీజేపీ లీగల్ చర్యలకు సిద్ధమైంది.
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని చిక్కులు ఎదురవుతున్నాయి. ఆ పార్టీ ముఖ్యనేత సిద్ధరామయ్య లింగాయత్‌లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. దీనిపై బీజేపీ లీగల్ చర్యలకు సిద్ధమైంది. అవినీతి లింగాయత్ సీఎంలంటూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా తాజాగా బెంగళూరులోని మెజిస్ట్రేట్ కోర్టులో బీజేపీ కార్యకర్త శంకర్ సైత్ పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 29కి తదుపరి విచారణను వాయిదా వేసింది.
దీంతో ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న తరుణంలో ఈ పరిణామం ఆసక్తిగా మారింది. పరువు నష్టం కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన పదవిని సైతం కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పరువు నష్టం కోణంలో న్యాయపోరాటానికి దిగడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ విషయంలో అంతిమ ఫలితం ఎలా ఉండబోతోందనేది కన్నడ నాట ఉత్కంఠ రేపుతున్నది.