జైలులో నుంచే ఒమర్ అబ్దుల్లాను ఓడించాడు

దిశ, నేషనల్ బ్యూరో : కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లాకు ఓటమి ఎదురైంది.

Update: 2024-06-04 12:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లాకు ఓటమి ఎదురైంది. ఆయన బారాముల్లా లోక్‌సభ స్థానంలో ఓడిపోయారు. జైలులో ఉన్న కశ్మీరీ నేత షేక్ అబ్దుల్ రషీద్ చేతిలో ఒమర్ అబ్దుల్లా ఓటమిని చవిచూశారు. జైలులో ఉన్నా ఆయన ఎలా గెలిచారు ? అనే దానిపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. దీనికి సమాధానం దొరకాలంటే షేక్ అబ్దుల్ రషీద్ కుమారుడు 22 ఏళ్ల అబ్రార్ రషీద్‌ను కలవాలి. జైలులో ఉన్న తన తండ్రి విజయం కోసం ఎన్నికల ప్రచారానికి అబ్రార్ చేసిన ఖర్చు ఎంతో తెలుసా ? కేవలం రూ.27వేలు మాత్రమే. దాదాపు 4 లక్షల ఓట్ల మెజారిటీ రావడం అనేది తన తండ్రి నిర్దోషిత్వానికి నిదర్శనమని అబ్రార్ చెప్పారు. ఈ ఎన్నికల ఫలితం తర్వాతైనా ఆయనకు జైలు నుంచి విముక్తి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పుడు నా వెంట ఎవరూ లేరు. మా దగ్గరున్న ఒక వాహనాన్ని ప్రచాార రథంగా మార్చుకున్నాం. ప్రచారం ముగిసేదాకా దానిలో డీజిల్ వేసుకోవడానికి దాదాపు రూ.27వేలు ఖర్చయింది. నా ప్రచారానికి వేలాది మంది వాలంటీర్లు సహకరించారు. అందుకే ఈ విజయం సాధ్యమైంది’’ అని అబ్రార్ వివరించారు.


Similar News