Nationwide Strike : దేశవ్యాప్త కార్మిక సమ్మెకు పిలుపు

పలు కార్మిక సంఘాలు(Trade Unions) దేశవ్యాప్త సమ్మె(Nationwide Strike)కు పిలుపునిచ్చాయి.

Update: 2025-03-18 16:07 GMT
Nationwide Strike : దేశవ్యాప్త కార్మిక సమ్మెకు పిలుపు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : పలు కార్మిక సంఘాలు(Trade Unions) దేశవ్యాప్త సమ్మె(Nationwide Strike)కు పిలుపునిచ్చాయి. కార్మికుల వివిధ డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతూ మే 20న కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొననున్నాయి. బుధవారం కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సంస్థలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో కార్మిక జాతీయ సమావేశం నిర్వహించాయి. మే 20న జరపనున్న ఈ సమ్మె కోసం రానున్న రెండు నెలలపాటు ప్రచారం నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ సమ్మె భవిష్యత్తులో కార్మిక, రైతుల పోరాటాలు నాంది లాంటిది అని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.

కాగా లేబర్ కోడ్ రద్దు(Repeal of the Labor Code) చేయడం, ప్రైవేటీకరణ నిలిపివేయడం, నెలవారి వేతనం రూ.26 వేలకు పెంచడం, ఉద్యోగుల పెన్షన్ కింద ప్రతినెల రూ.9 వేలు అందించడం వంటివి కార్మిక సంఘాల డిమాండ్స్ లో ముఖ్యమైనవి. అలాగే ఏ పథకం కిందకి రానివారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారికి నెలకు రూ.6 వేలు ఇవ్వాలని కోరారు. దేశంలోని పేదరికం, నిరుద్యోగం, అసమానతలు రూపుమాపాలని ఎన్డీఏ సర్కార్ కు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతుందని కార్మిక సంఘాలు తెలిపాయి. 

Tags:    

Similar News