13 నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్

దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

Update: 2024-07-10 04:13 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేయడం, పలువురు చనిపోవడం వల్ల ఏర్పడిన ఖాళీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహిస్తుంది. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 6 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్‌ల వద్ద ప్రజలు బారులు తీరారు. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జూలై 13 న జరగనుంది. మరీ ఈ ఉప ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి పైచేయి సాధిస్తుందా.. లేక ప్రతిపక్ష కూటమి మరోసారి పుంజుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.


Similar News