One Nation One Election : జమిలి ఎన్నికల విధానంపై అమిత్‌షా, మాయావతి ఏమన్నారంటే..

దిశ, నేషనల్ బ్యూరో : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ విధానం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కొనియాడారు.

Update: 2024-09-18 14:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ విధానం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కొనియాడారు. పారదర్శకమైన ఎన్నికల వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయాలనే ప్రధాని మోడీ ఉక్కు సంకల్పానికి ఈ నిర్ణయం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం వల్ల ఎన్నికల నిర్వహణ ఖర్చులు తగ్గిపోయి, దేశ వికాసానికి కేటాయింపులు పెంచే అవకాశం కలుగుతుందన్నారు.

జమిలి ఎన్నికల విధానం అనేది ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన సంస్కరణల్లో ఓ మైలురాయి లాంటిదని అమిత్‌షా అభివర్ణించారు. ఇక ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ విధానాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి వెల్లడించారు. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. జాతీయ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలను సాధించే దిశగా ఈ విధానంలో స్పష్టమైన నిబంధనలు ఉండాలని ఆమె పేర్కొన్నారు.


Similar News