BREAKING: లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 22న సెషన్స్ ప్రారంభమై మొత్తం 16 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. ఆగస్ట్ 12న తిరిగి బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) ఏర్పడింది. కమిటీలో మొత్తం 14 మందికి చోటు లభించింది. లోక్‌సభ సమావేశాల్లో ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలి. ఏ పార్టీలకు చర్చలో అవకాశం కల్పిచాలనే విషయలను బీఏసీ ఖరారు చేస్తోంది. బీఏసీలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం టీడీపీకి మాత్రమే చోటు దక్కింది. ఈ క్రమంలో లోక్‌సభపక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు సభ్యుడిగా వ్యవహరిస్తారు. బీఏసీలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, టీడీపీలు పార్టీలు భాగస్వాముల కానున్నాయి, కాగా, ఈ నెల 23న ఉదయం 11 గంటలకు సభకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడతారు.