BREAKING: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్‌ ఎంపీ కె. సురేష్‌ నియామకం

దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది.

Update: 2024-06-17 12:58 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభ కానున్నాయి. దీంతో ఈ నెల 26న లోక్‌సభకు నూతన స్పీకర్‌ను ఎన్నుకునే ప్రక్రియ ఉంటుంది. అయితే, అప్పటి వరకు ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత కె.సురేష్‌ పేరును ఖరారు చేసినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. కేరళలోని మవెలికర నుంచి ఎంపీగా గెలిచిన కె.సురేష్‌ చాలాకాలం నుంచి పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యే ముందు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కొలువుదీరనున్న18వ లోక్‌సభలో ప్రధాని, మంత్రి మండలి, ఇతర ఎంపీలతో ఆయన ప్రమాణం చేయించనున్నారు.


Similar News