Yediyurappa : యడియూరప్పను విచారించాలి.. జస్టిస్ మైఖేల్ కమిషన్ సిఫారసు

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలో గత బీజేపీ(BJP) హయాంలో చోటుచేసుకున్న ‘కొవిడ్-19 స్కాం’పై హైకోర్టు రిటైర్డ్ జడ్జి మైఖేల్ డీ కున్హ సారథ్యంలోని దర్యాప్తు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.

Update: 2024-11-09 13:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలో గత బీజేపీ(BJP) హయాంలో చోటుచేసుకున్న ‘కొవిడ్-19 స్కాం’పై హైకోర్టు రిటైర్డ్ జడ్జి మైఖేల్ డీ కున్హ సారథ్యంలోని దర్యాప్తు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. నాడు సీఎంగా ఉన్న బీజేపీ సీనియర్ నేత బి.ఎస్.యడియూరప్పను(Yediyurappa) విచారించాలని దర్యాప్తు కమిషన్ సిఫారసు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద ఆయనను ప్రశ్నించాలని కాంగ్రెస్ సర్కారుకు సూచించింది. అప్పట్లో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరించిన బి.శ్రీరాములును కూడా విచారించాలని తెలిపింది.

2020 సంవత్సరం మార్చి-ఏప్రిల్ మధ్యకాలంలో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం దాదాపు 3 లక్షల పీపీఈ కిట్లను చైనా కంపెనీల నుంచి కొనుగోలు చేసింది. మార్కెట్ ధర కంటే ఎక్కువ రేటుకు వాటిని కొని.. కొవిడ్(Covid) నిధులను దుర్వినియోగం చేశారని దర్యాప్తు కమిషన్ గుర్తించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసిన మైఖేల్ డీ కున్హ కమిషన్ ఆగస్టు 31నే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.

Tags:    

Similar News