Bengaluru: బెంగళూరులో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. సీఎం ఇంటి ముట్టడికి బీజేపీ ప్రయత్నం

బెంగళూరు (Bengaluru)లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.

Update: 2024-09-25 06:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు (Bengaluru) లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలోనే సీఎం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో భారీగా మొహరించిన పోలీసులు.. ఆందోళనకారులను అడ్డుకోవడమే కాకుండా పలువురిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

ఇదిలా ఉంటే ముడా భూ కుంభకోణం కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనను విచారించేందుకు గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ అనుమతించడం తెలిసిందే. ఆ ఉత్తర్వుల చట్టబద్ధతను సవాలు చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు (High Court) మంగళవారం కొట్టేసింది. గవర్నర్‌ నిర్ణయం చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. దీంతో స్కాంలో ఇరుక్కున్న సీఎం వెంటనే రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు మంగళవారం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు.


Similar News