లిక్కర్ పాలసీ కేసు విచారణ వాయిదా
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్‌పై విచారణను రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు వచ్చే నెల 4కు వాయిదా వేసింది
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్‌పై విచారణను రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు వచ్చే నెల 4కు వాయిదా వేసింది. రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా సీబీఐ చార్జి షీట్‌పై విచారణ జరిపారు. విచారణకు ఎమ్మెల్సీ కవిత, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చ్యువల్ గా హాజరయ్యారు. సీబీఐ వేసిన ఛార్జ్ షీట్‌లో డాక్యూమెంట్స్ సరిగా లేవని లాయర్లు కోర్టుకు తెలిపారు. తమకు పంపిన డాక్యూమెంట్స్‌లో పేజీలు బ్లాక్‌గా ఉన్నాయని కోర్టుకు నివేదించారు. దీంతో గత విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ప్రతివాదులకు అందించిన కాపీలలో క్లారిటీగా లేని డాక్యూమెంట్లను మళ్ళీ అందజేయాలని ఆదేశిస్తూ విచారణను జడ్జి కావేరి బవేజా వచ్చే నెల 4కు వాయిదా వేశారు.