బిలియనీర్ కేశబ్ మహీంద్రా కన్నుమూత

ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్ 2023 లో చోటు దక్కించుకున్న అతి పెద్ద భారతీయుడు, మహీంద్రా గ్రూప్ మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా (99) కన్నుమూశారు.

Update: 2023-04-12 06:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్ 2023 లో చోటు దక్కించుకున్న అతి పెద్ద భారతీయుడు, మహీంద్రా గ్రూప్ మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా (99) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు.. రిటైర్డ్ మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా ట్విట్టర్‌లో ద్వారా తెలిపారు. "పారిశ్రామిక ప్రపంచం నష్టపోయింది. ఈ రోజు అత్యంత ఎత్తైన వ్యక్తులలో ఒకరు." కేశబ్ మహీంద్రా 50 సంవత్సరాల పాటు మహీంద్రా సమ్మేళనానికి నాయకత్వం వహించారు. తన ట్వీట్ ద్వారా తెలియపరచారు. కాగా కేషుబ్ మహీంద్రా మృతి పట్ల ప్రముఖ వ్యాపారవేత్తలు సంతాపం తెలుపుతున్నారు. ఆయన 1963 నుంచి 2012వరకు మహీంద్రా గ్రూపుకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. అలాగే సెయిల్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, ఐసీఐసీఐ లాంటి ప్రముఖ కంపెనీ బోర్డుల్లో కేశబ్ మహీంద్రా కీలక బాధ్యతలు నిర్వహించారు. హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గానూ కేషబ్ ఉన్నారు.

Also Read..

ఏప్రిల్-12: గ్యాస్ సిలిండర్ ధరలు

Tags:    

Similar News