Pappu Yadav: బిహార్ ఎంపీకి బెదిరింపుల కేసులో నిందితుడు అరెస్టు

బిహార్ పూర్నియా ఎంపీ పప్పూ యాదవ్‌కి(Pappu Yadav) ఇటీవల గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి.

Update: 2024-12-04 10:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ పూర్నియా ఎంపీ పప్పూ యాదవ్‌కి(Pappu Yadav) ఇటీవల గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో, తనకు సెక్యూరిటీ పెంచాలని బిహార్ ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని కోరారు. అయితే, ఈ కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడ్ని చూశాక పోలీసులు షాక్ అయ్యారు. థ్రెట్ కాల్స్ చేసింది పప్పూ యాదవ్ మాజీ అనుచరుడు రాంబాబు యాదవ్ అని తేలింది. పప్పూ యాదవ్‌కి సెక్యూరిటీ పెంచే ఉద్దేశంతోనే బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా నటిస్తూ కాల్స్ చేసినట్లు బయటపడింది. నిందితుడ్ని పోలీసులు అరెస్టి చేశారు. నిందితుడి లొకేషన్ ట్రేస్ చేసి మంగళవారం భోజ్‌పూర్ జిల్లాలోని అతడి స్వగ్రామం నుంచి అరెస్ట్ చేశారు.

నిందితుడి గురించి..

ప్రాథమిక దర్యాప్తులో నిందితుడికి ఏ ముఠాతో సంబంధాలు లేవని, పలువురి సూచనల మేరకే ఎంపీకి బెదిరింపు సందేశాలు పంపినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఎంపీకి ఇలా వీడియో పంపినందుకు రూ. 2000 చెల్లించినట్లు రాంబాబు యాదవ్ వెల్లడించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా మరికొంతమంది రాజకీయ నాయకుల్ని బెదిరించడానికి రూ. 2 లక్షలు చెల్లించేందుకు రెడీ అయ్యాడని వివరించారు. అయితే, నిందితుడికి డబ్బులు ఎవరిచ్చారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్‌ను అంతమొందించాలని పప్పు యాదవ్ కామెంట్స్ చేశారు. అప్పట్నుంచి తనకు బెదిరింపులు వస్తున్నట్లు పప్పుయాదవ్ పోలీసులను ఆశ్రయించారు. ఇకపోతే, లోక్ సభ ఎన్నికలో పప్పుయాదవ్ పూర్నియా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు.

Tags:    

Similar News