హిందూ గ్రంథాల్లో అంతా విషమే.. ‘రామ్‌చరిత్ మానస్‌’ గ్రంథంపై మంత్రి వివాదాస్పద కామెంట్స్

‘రామ్‌చరిత్ మానస్‌’ గ్రంథంపై బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-09-15 12:09 GMT

పాట్నా : ‘రామ్‌చరిత్ మానస్‌’ గ్రంథంపై బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూమతంలోని గ్రంథాల్లో ‘రామ్‌ చరిత్ మానస్‌’ సైనైడ్ లాంటిదన్నారు. పాట్నాలోని ఓ విద్యాసంస్థలో జరిగిన హిందీ దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘మీ ముందుకు 55 రకాల వంటలను తీసుకొచ్చి పెట్టి, అందులో పొటాషియం సైనైడ్ కలిపి తినమంటే ఎలా ఉంటుంది..? ఆ ఫుడ్‌ను మీరు తింటారా..? హిందూమతంలోని గ్రంథాల్లోనూ ఇలాంటి విషమే ఉంది. చాలామంది రచయితలు బాబా నాగార్జున్, లోహియాలాంటి వాళ్లూ ఈ గ్రంథాల్లోని విషయాలను వ్యతిరేకించారు.

రామ్‌చరిత్‌ మానస్‌పై ఉన్న ఈ అభిప్రాయం ఎప్పటికీ మారదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఓ సందర్భంలో కుల వ్యవస్థ గురించి మాట్లాడారు’’ అని చంద్రశేఖర్ కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ.. రామ్‌చరిత్‌ మానస్‌పై చంద్రశేఖర్ పదేపదే చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు సీఎం నితీశ్ కుమార్‌‌కు వినిపించడం లేదా అని ప్రశ్నించింది. కాగా, మనుస్మృతి, రామ్‌చరిత్ మానస్ లాంటి పుస్తకాలు సమాజాన్ని విడగొడతాయని గతంలోనూ చంద్రశేఖర్ వ్యాఖ్యలు చేశారు.


Similar News