Quad summit: అమెరికాలో జరిగే క్వాడ్ సదస్సుకి హాజరుకానున్న మోడీ

క్వాడ్ సదస్సుకు(Quad summit) హాజరుకావాల్సిందిగా అమెరికా నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి(Prime Minister Narendra Modi) ఆహ్వానం అందింది.

Update: 2024-09-13 05:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: క్వాడ్ సదస్సుకు(Quad summit) హాజరుకావాల్సిందిగా అమెరికా నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి(Prime Minister Narendra Modi) ఆహ్వానం అందింది. తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ మోడీకి(Joe Biden) ఆహ్వానం పంపించారు. కాగా.. సెప్టెంబర్ 21న జరిగే క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపోతే, క్వాడ్ సభ్య దేశాల సమావేశానికి అమెరికా ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ నెల 21వ తేదీన డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఈ సదస్సు ఏర్పాటు చేయబోతున్నారు. ఇన్- పర్సన్ క్వాడ్ సమ్మిట్‌ విల్మింగ్టన్‌లో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. క్వాడ్‌లో ఆతిథ్య అమెరికాతో పాటు భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లకు సభ్య దేశాలుగా ఉన్నాయి. జో బైడెన్‌, మోడీతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానమంత్రులు ఆంథోని అల్బెనీస్, ఫ్యుమియో కిషిడ ఈ సదస్సులో పాల్గొననున్నారు. 2021లో వైట్‌హౌస్‌లో మొట్ట మొదటి క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ సమావేశం ఏర్పాటవుతూ వస్తుంది.

మూడ్రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న మోడీ

కాగా.. సెప్టెంబర్ 21 నుంచి మూడ్రోజుల పాటు మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ క్వాడ్ సమ్మిట్‌కు హాజరుకావడంతో పాటు భాగస్వామ్య దేశాల నేతలతో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించనున్నారు. సెప్టెంబర్ 22న న్యూజెర్సీలో జరిగే ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్‌కు కూడా మోడీ హాజరుకానున్నారు. సెప్టెంబర్ 23న జరిగే సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌లో కూడా పాల్గొంటారు. ఈ ఏడాది జూలైలో టోక్యోలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. ఆరోగ్య భద్రత, ప్రకృతి వైపరీత్యాల ప్రతిస్పందన, సముద్ర భద్రత, మౌలిక సదకుపాయాలు, సాంకేతికత, వాతావరణం సహా పలు అంశాలపై చర్చించారు.


Similar News