Madhya Pradesh: భార్య ముందు అంకుల్ అని పిలిచినందుకు దాడి

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) రాజధాని నగరం భోపాల్‌లో(Bhopal) దారుణ ఘటన జరిగింది. భార్యకు చీరలు కొనడానికి వెళ్లిన రోహిత్‌ అనే వ్యక్తి షాప్ కీపర్ విశాల్ ని చితకబాదాడు.

Update: 2024-11-04 07:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) రాజధాని నగరం భోపాల్‌లో(Bhopal) దారుణ ఘటన జరిగింది. భార్యకు చీరలు కొనడానికి వెళ్లిన రోహిత్‌ అనే వ్యక్తి షాప్ కీపర్ విశాల్ ని చితకబాదాడు. శనివారం రోజు భార్యతో కలిసి చీరలు కొంటున్న రోహిత్‌కు షాప్ కీపర్ విశాల్‌ చాలా చీరలు చూపించాడు. ఎన్ని చీరలు చూసినా రోహిత్‌ దంపతులు ఒక్కటీ సెలెక్ట్‌ చేయలేదు. దీంతో విసుగెత్తిన విశాల్‌ మీకు వెయ్యి రూపాయల రేంజ్‌లో చీరలు కావాలా అని అడిగాడు. ‘మేం అంతకంటే ఎక్కువ రేంజ్‌ చీరలే కొనగలం, మమ్మల్ని తక్కువ అంచనా వేయకు’అని రోహిత్ మ విశాల్‌పై అగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో విశాల్‌ స్పందిస్తూ ‘అంకుల్‌ మీకు అన్ని రేంజ్‌ల చీరలు చూపిస్తాను’అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. దీంతో కోపోద్రిక్తుడైన రోహిత్.. విశాల్‌ని మళ్లీ అలా పిలవవద్దని హెచ్చరించాడు. దీంతో, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

షాప్ కీపర్ తో వాగ్వాదం

షాప్ కీపర్ తో వాగ్వాదం జరిగిన తర్వాత రోహిత్ తన భార్యతో కలిసి షాపు (Bhopal man thrashes shopkeeper) నుంచి బయటకు వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత కొంత మంది స్నేహితులతో రోహిత్ దుకాణానికి తిరిగి వచ్చాడు. విశాల్ ని షాప్ నుంచి రోడ్డుపైకి లాగి కర్రలు, బెల్ట్ లతో కొట్టారు. అనంతరం నిందితులు అక్కడ్నుంచి పారిపోయారు. దాడిలో విశాల్‌కి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో, అతడు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని రోహిత్, అతని స్నేహితులపై ఫిర్యాదు చేశాడు. వైద్య పరీక్షల నిమిత్తం అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి మనీష్ రాజ్ సింగ్ బదౌరియా తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.


Similar News