భర్తకేమో మోడలింగ్ అని చెప్పింది.. చేసేది మాత్రం ఆ పని!
భర్తకు మోడలింగ్ అని చెప్పి ఓ వివాహిత గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తూ పోలీసులకి చిక్కింది
దిశ, వెబ్ డెస్క్: నాగ్పూర్ కి చెందిన రష్మి (27) ముగ్గురు పిల్లల తల్లి. ఫిట్ నెస్ విషయంలో మంచి కేర్ తీసుకుంటుంది రష్మి. అందుకే ఆమెను ముగ్గురు పిల్లల తల్లి అంటే ఎవరూ నమ్మరు. తన భర్తతో మోడలింగ్ షూటింగ్ అంటూ రష్మి.. నిత్యం బయటే తిరుగుతుంటుంది. అయితే తాజాగా రష్మి గురించి తెలిసిన ఆమె భర్త కంగుతిన్నాడు. రష్మి చేస్తోంది మోడలింగ్ కాదని.. ప్రాస్టిట్యూషన్ అని తెలియడంతో అతడు షాక్ కు గురయ్యాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా మొదటి దశ టైంలో రష్మి కుటుంబం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ క్రమంలోనే ఆమెకు ఢిల్లీకి చెందిన దీపేశ్ తో పరిచయం ఏర్పడింది. దీపేశ్ ఆన్ లైన్ లో ప్రాస్టిట్యూషన్ బిజినెస్ నడుపుతుంటాడు. కస్టమర్లతో మాట్లాడి దేశవ్యాప్తంగా ప్రాస్టిట్యూట్లను సప్లై చేస్తుంటాడు. అలా వెళ్లిన ప్రాస్టిట్యూట్లు ఒప్పందం ప్రకారం గడువు ముగిసే దాకా కస్టమర్లను ఖుషి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రష్మిని కూడా దీపేశ్ వ్యభిచార రొంపిలోకి లాగాడు. దీంతో మోడలింగ్ పేరుతో దేశంలోని పలు ప్రాంతాలు తిరుగుతూ రష్మి వ్యభిచారం చేస్తోంది.
భర్తకు, బంధువులకు మాత్రం మోడలింగ్ కోసం దేశంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు చెప్పేది. ఈ క్రమంలోనే వారం కిందటి షూటింగ్ ఉందని చెప్పిన రష్మి నాగ్పూర్ కు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె హోటల్ ఫ్లోరా ఇన్ లో కస్టమర్లతో ఉండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. దీంతో ఆమె బండారం బయటపడింది. ఇంత కాలం గుట్టుగా సాగుతూ వచ్చిన ఆమె వ్యవహారం ఒక్కసారిగా బట్టబయలైంది. దీంతో భర్త, పిల్లలకు ముఖం చూపించలేక కటకటాలు లెక్కపెడుతోంది.