'బాధితులకు ముందస్తుగా చెప్పి దాడులు చేస్తేనే అది సాధ్యం'.. కపిల్ సిబల్ ట్వీట్

Update: 2023-06-11 13:38 GMT

న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు ఆధారాలుగా ఫొటోలు, ఆడియో, వీడియోలను ఇవ్వాలని ఇద్దరు మహిళా రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు కోరినట్లు సమాచారం. బ్రిజ్ భూషణ్ హగ్ చేసుకున్నట్టుగా ఏవైనా ఆధారాలుంటే ఇవ్వాలని ఇద్దరు రెజ్లర్లను పోలీసులు అడిగారంటూ ఒక జాతీయ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

దీనిపై స్పందించిన రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ట్విట్టర్ వేదికగా ఢిల్లీ పోలీసులపై విరుచుకుపడ్డారు. “బ్రిజ్ భూషణ్ ను దర్యాప్తు చేయడానికి పోలీసులు వీడియో, ఆడియో, కాల్ రికార్డింగ్‌లు, వాట్సాప్ చాట్‌లను రుజువుగా ఇవ్వాలని అడుగుతున్నారట. ఇకపై బాధితులు కెమెరాను క్లిక్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. దాడిని రికార్డ్ చేయడానికి ఎవరైనా రెడీ కావాలి. ఇవన్నీ జరగాలంటే.. బాధితులకు ముందస్తుగా చెప్పిన తర్వాత దాడులు జరగాలి!" అని కామెంట్ చేశారు.


Similar News