సీఎం బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు.. అక్కడి నుంచే పోటీ చేస్తా
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాను షిగ్గాన్ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు.
బెంగళూరు: కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాను షిగ్గాన్ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వ అనుకూలత ఉందని బొమ్మై చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ఈ సారి ఎన్నికలకు బీజేపీ పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు చెప్పారు. తమ పనితీరు ఆధారంగానే ఓట్లు ఆశిస్తున్నామని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో భారీగా అవినీతి జరిగిందని విమర్శించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించిందని ఆరోపించారు. కాగా, 2021 నుంచి బొమ్మై సీఎంగా కొనసాగుతున్నారు. మరోవైపు బీజేపీ ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేసే వారి జాబితాను ప్రకటించలేదు. వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.