Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని దాడులు

Update: 2024-11-03 03:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో హిందూ మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. ఈ దాడుల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోగా వందల మంది ఆస్తులని, అయినవాళ్లని కోల్పోయి అనాథలుగా మారారు. ఇది చాలక పదుల సంఖ్యలో హిందూ సమాజ నాయకులపై దేశద్రోహం కేసులు నమోదు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. దీంతో అక్కడి మైనారిటీ హిందువులు (Hindus) తమకు రక్షణ కల్పించాలంటూ ర్యాలీలు, ఆందోళనలు చేస్తున్నారు. ముస్లింలు మెజారిటీగా ఉండే బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో హిందువులపై దాడులు, వేధింపులు పెరిగిపోయాయని, వీటి నుండి తమను రక్షించాలని, హిందూ సమాజ నాయకులపై దేశద్రోహం కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి హిందువులు. ఈ క్రమంలోనే హిందూ సమాజానికి చెందిన సుమారు 300 మంది శనివారం ఢాకాలో సమావేశమయ్యారు.

బంగ్లాదేశ్‌లో ఈ ఆగస్టులో తిరుగుబాటు జరిగినప్పటి నుంచి హిందువులపై వేలాది దాడులు జరిగాయని హిందూ సంఘాల మాట. ఆగస్టు 4 నుంచి హిందువులపై దాదాపు 2000 కంటే ఎక్కువ దాడులు జరిగాయని దేశంలోని మైనారిటీ గ్రూప్ బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రైస్తవ ఐక్యత కౌన్సిల్ ఆందోళన చెందుతోంది.


Similar News