డిస్నీ+ హాట్‌స్టార్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్‌స్టార్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్‌స్టార్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. హాట్‌స్టార్‌లో హాలీవుడ్ సినిమాలు అందించే హెచ్‌బీఓ కంటెంట్ బంద్ కానుంది. మార్చి 31 నుంచి ఈ ప్రసారాలు నిలిపివేయనున్నట్లు డిస్నీ+హాట్‌స్టార్ వెల్లడించింది. హెచ్‌బీఓ కంటెంట్ ఇక హాట్‌స్టార్‌లో ఉండబోదని తెలిపింది. ఇప్పటికే 10 భాషల్లో లక్ష గంటలకు పైగా అందుబాటులో ఉన్న టీవీ షోలు, సినిమాలు, ప్రధాన స్పోర్ట్స్ ఈవెంట్లను ఆనందించొచ్చని ట్వీట్‌లో పేర్కొంది.
హెచ్‌బీఓ ఒరిజినల్ షోలను డిస్నీస్టార్ 2016 నుంచి ప్రసారం చేస్తోంది. అమెరికాలో ప్రసారం అయ్యే రోజే హాట్‌స్టార్‌లోనూ అందుబాటులోకి వచ్చేది. వీటితో పాటు హెచ్‌బీఓలో అందుబాటులో ఉండే హాలీవుడ్ సినిమాలు, సిరీస్‌లను వీక్షించేవారు. ఇకపై హాట్‌స్టార్‌లో ఆ కంటెంట్ లభించదు. కాగా, ఖర్చులను తగ్గించుకోవాలని డిస్నీ నిర్ణయించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.