Earthquakes: కశ్మీర్ లో వరుసగా రెండుసార్లు కంపించిన భూమి

కశ్మీర్ వ్యాలీలో వరుసగా రెండుసార్లు భూప్రకంపనలు వచ్చాయి. బరాముల్లా జిల్లాలో వరుసగా రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Update: 2024-08-20 04:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కశ్మీర్ వ్యాలీలో వరుసగా రెండుసార్లు భూప్రకంపనలు వచ్చాయి. బరాముల్లా జిల్లాలో వరుసగా రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై 4.9, 4.8 తీవ్రతతో వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. అయితే, ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఉదయం 6.45 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. బారాముల్లా జిల్లాలో 5 కిలోమీటర్ల లోతుగా భూకంపం కేంద్రీకృతమైంది. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ వాతావరణ శాఖ డైరెక్టర్ ముఖ్తార్ అహ్మద్ తెలిపారు.

రెండోసారి భూకంపం

బారాముల్లా జిల్లాలోనే రెండోసారి భూకంపం సంభవించింది. ఉదయం 6.52 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేలుపై 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. 10 కిలోమీటర్ల లోతుగా భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపారు. భూమి కంపించడంతో చాలా చోట్ల ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే, ఎక్కడా ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి నివేదికలు రాలేదని అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయలో భూప్రకంపనలు అధికంగా సంభవిస్తాయి. 2005 అక్టోబర్ 8న కశ్మీర్ వ్యాలీలో భూకంపం వచ్చింది. రిక్టార్ స్కేలుపై 7.6 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 80 వేల మంది ఆ దుర్ఘటనలో చనిపోయారు.


Similar News