అట్టపెట్టెల్లో చింపాంజీ పిల్లలు, ఊసరవెల్లులు

అడవుల్లో స్వేచ్చగా తిరుగాల్సిన వన్యప్రాణులను చిన్నచిన్న అట్టెపెట్టెల్లో నిర్భంధించి అక్రమ రవాణ చేస్తున్న ముఠా చెన్నై కస్టమ్స్ అధికారులకు చిక్కింది.

Update: 2024-10-17 05:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : అడవుల్లో స్వేచ్చగా తిరుగాల్సిన వన్యప్రాణులను చిన్నచిన్న అట్టెపెట్టెల్లో నిర్భంధించి అక్రమ రవాణ చేస్తున్న ముఠా చెన్నై కస్టమ్స్ అధికారులకు చిక్కింది. మలేసియా కౌలాలంపూర్ నుంచి విమానంలో చెన్నైకి అట్టపెట్టెల్లో చింపాంజీ పిల్లలు, ఊసరవెల్లులను అక్రమంగా తరలిస్తున్నారు. చెన్నై శివారుల్లోని ఫామ్‌హౌస్ లలో ఇటీవ‌ల‌ బడాబాబులు చింపాంజీలు, ఊసరవెల్లులను పెంచుకుంటుండటం ఫ్యాషన్ గా మారింది. వారి కోసం కౌలాలంపూర్ నుంచి విమానంలో ఓ మహిళ చింపాంజీ పిల్లలను, వివిధ రకాల ఊసర వెల్లులను అక్రమ రవాణ చేస్తోంది. చెన్నై కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో అట్టపెట్టెల్లో దాచిన చింపాంజీ పిల్లలు, ఊసరవెల్లులను గుర్తించారు. ఆ మహిళను అరెస్టు చేశారు.

వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎంతకాలంగా ఇలా వన్యప్రాణులను అక్రమంగా రవాణ చేస్తున్నారు..ఏయే ప్రాణులను రవాణ చేశారన్నదానిపై విచారణ సాగిస్తున్నారు. గతంలో చైన్నై విమానాశ్రయంలోనే బ్యాంకాక్ ప్రయాణీకుడి వద్ద ప్రాణంతో రెండు లగేజ్ బ్యాగ్ లలో 45 బాల్ ఫైతాన్స్, 3 అరుదైన జాతి కోతులు, 3 స్టార్ తాబేళ్ళు, 8 పాములను కస్టమ్స్ అధికారులు పట్టుకోవడం జరిగింది. 


Similar News