Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య కేసులో బయటకొస్తున్న సంచలనాలు

ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) సీనియర్‌ నేత, సల్మాన్‌ఖాన్‌ స్నేహితుడు బాబా సిద్ధిఖీ(Baba Siddique) హత్య కేసులో సంచనలనాలు బయటకొస్తున్నాయి.

Update: 2024-10-13 05:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) సీనియర్‌ నేత, సల్మాన్‌ఖాన్‌ స్నేహితుడు బాబా సిద్ధిఖీ(Baba Siddique) హత్య కేసులో సంచనలానలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నిందితులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానాకు చెందిన కర్నైల్ సింగ్, యూపీకి చెందిన ధర్మరాజ్ కశ్యప్ అనే ఇద్దరు నిందితులు దాదాపు నెలరోజుల పాటు రెక్కీ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బాంద్రా ఈస్ట్ లోని షూటింగ్ స్పాట్ లో నెలపాటు రెక్కీ నిర్వహించినట్లు అధికార వర్గాలు చెప్పాయి. అయితే, ఈ హత్యపై బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఎన్నికల వేళ..

త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఇలాంటి సమయంలో కాల్పుల ఘటన రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. ఇకపోతే, ఈ ఏడాది ఏప్రిల్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఇంటి వద్ద గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కాల్పులకు పాల్పడింది. గత కొంతకాలంగా సల్మాన్‌ను టార్గెట్‌ చేసిన బిష్ణోయ్‌ గ్యాంగ్‌.. అతడి స్నేహితుడైన బాబా సిద్ధిఖీని హత్య చేయడంతో పలు సందేహాలు తెరపైకి వచ్చాయి. అయితే.. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సిద్ధిఖీకి ఎలాంటి బెదిరింపులు రాలేదని పోలీసులు తెలిపారు. ఇతర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా.. బాబా సిద్ధిఖీకి ప్రాణహాని ఉందని అతడి స్నేహితులు చెప్పడంతో 15 రోజుల క్రితమే ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించారు. భద్రత ఉన్నప్పటి ఆయన హత్య జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.


Similar News