Azharuddin : మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు షాక్.. మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు

మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు షాక్ తగిలింది.హెచ్‌సీఏతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది.

Update: 2024-10-03 06:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్‌కు షాక్ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సమన్లు జారీ చేసింది. అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారని, రూ. 20 కోట్ల మేర నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమాలపై ప్రస్తుతం ఈడీ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే సమన్లు జారీ చేసింది. ఈరోజే తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు పంపడం ఇదే మొదటి సారి. కాగా, 2019 నుంచి 2023 వరకు అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పని చేశారు. ఈ సమయంలోనే హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం కోసం డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక వ్యవస్థలు, ఇతర పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి.  


Similar News