వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కేజ్రీవాల్ భేటీ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 'ఆఫ్ ద ఎజెన్సీ, బై ద ఎజెన్సీ, ఫర్ ద ఎజెన్సీ' ప్రభుత్వంగా మారిందని దుయ్యబట్టారు.

Update: 2023-05-23 12:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 'ఆఫ్ ద ఎజెన్సీ, బై ద ఎజెన్సీ, ఫర్ ద ఎజెన్సీ' ప్రభుత్వంగా మారిందని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని మారుస్తుందేమోన అని భయం ఉందని రేపో మాపో దేశం పేరు కూడా మారుస్తారనే ఆందోళ వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లు కోల్ కతాలో మమతా బెనర్జీని కలిశారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకురావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మణిపూర్ లో అల్లర్లు జరుగుతుంటే అక్కడికి వెళ్లి పరిస్థితి చూసేందుకు బీజేపీ నెతలెవరికి సమయం లేదా అని ప్రశ్నించారు. కాగా ఈ విషయంలో కేజ్రీవాల్ కు ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు అండగా నిలిచారు. నితీష్ కుమార్‌తో పాటు కాంగ్రెస్ కూడా ఆప్ కు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యలో తాజాగా మమతా బెనర్జీ సైతం కేజ్రీవాల్ కు అండగా నిలవడం ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News