ISKCON: బంగ్లాదేశ్ లోని ఇస్కాన్ ఆలయంపై దాడులు
బంగ్లాదేశ్(Bangladesh) లోని మరో ఇస్కాన్ (ISKCON) ఆలయంపై దాడులు జరిగాయి. ఢాకాలోని ఇస్కాన్ ఆలయంపై దాడులు జరిగిన ఆ సంస్థ ప్రకటించింది.
దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్(Bangladesh) లోని మరో ఇస్కాన్ (ISKCON) ఆలయంపై దాడులు జరిగాయి. ఢాకాలోని ఇస్కాన్ ఆలయంపై దాడులు జరిగిన ఆ సంస్థ ప్రకటించింది. ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. నామ్‌హట్టాలోని ఇస్కాన్ ఆలయానికి నిప్పంటించినట్లు తెలిపారు. ఇస్కాన్ కేంద్రంలోని అన్ని విగ్రహాలు ధ్వంసం అయినట్లు పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఢాకాలోని తురాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందన్నారు. ఆలయం వెనుక ఉన్న రూఫ్ ని పైకి తీసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
చిన్మయి కృష్ణదాస్ అరెస్టు
బంగ్లాలోని ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన చిన్మయి కృష్ణ దాస్ ఇటీవలే హిందువులకు సపోర్టుగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత గత నెలలో ఢాకాలో పోలీసులు అతనిని అరెస్టు చేసి.. దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఢాకా న్యాయస్థానం అతనికి బెయిల్ నిరాకరించింది. ఇక, బంగ్లా మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుంచి మైనారిటీలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయి. అలాగే, బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌లో చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యులు ఇద్దరు అదృశ్యమయ్యారని సమాచారం.