Annamalai : డీఎంకే పాలనపై తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై ఫైర్
డీఎంకే పాలనలో లైంగిక నేరస్తులు, రౌడీ షీటర్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : డీఎంకే పాలనలో లైంగిక నేరస్తులు, రౌడీ షీటర్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ప్రజా సమస్యలపై గొంతు వినిపిస్తున్న బీజేపీ శ్రేణులను డీఎంకే వేధిస్తోందని ఆరోపించారు. అన్నా యూనివర్సిటీలో లైంగిక దాడికి వ్యతిరేకంగా మధురైలో నిరసన తెలుపుతున్న బీజేపీ మహిళా మోర్చా నేతలను సైతం పోలీసులు గృహ నిర్భంధం చేశారని మండిపడ్డారు. భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి జరుగుతున్నా.. సీఎం స్టాలిన్ పట్టించుకోవడం లేదని అది ఆయన నియంతృత్వ పాలనకు నిదర్శమని అన్నామలై అన్నారు.