‘నీట్’పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి: కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్

నీట్ యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపించాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు.

Update: 2024-06-13 09:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపించాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల రోజే నీట్ ఫలితాలు వెల్లడించడంతోనే దానిపై అనుమానం కలుగుతోందని తెలిపారు. దీనిపై ఎలాంటి చర్చ ఉండకూడదనే ఉద్దేశంతోనే రిజల్ట్ విడుదల చేసినట్టు స్పష్టమవుతోందని చెప్పారు. దేశం మొత్తం ఎన్నికల ఫలితాలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఫలితాలు విడుదల చేయడం వెనుక ఉద్దేశం ఎంటో చెప్పాలని ఎన్డీఏను ప్రశ్నించారు.

ఈ మొత్తం కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎన్డీయే చైర్మన్ ను సైతం వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నీట్ కుంభకోణంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా దీనిపై స్పందించకుండా వేడుకలకు హాజరుకావడం, విదేశీ పర్యటనలు చేయడంలో మోడీ బిజీగా ఉన్నారని మండిపడ్డారు. కాగా, నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. 


Similar News